కలిసిన పలువురు వై సిపి నాయకులు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాపీలేశ్వరపురం:
కపిలేశ్వపురం, విశ్వం వాయిస్ న్యూస్: కోనసీమ జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గా బాధ్యతలు చేపట్టిన మండపేట నియోజవర్గ వైసీపీ నాయకులు వేగుళ్ళ పట్టాభిరామయ్యని పలువురు నాయుకులు అభినందించారు. కపిలేశ్వరపురం మండలం అద్దంకి వారి లంక గ్రామ 9 వ, వార్డు సభ్యులు, సీనియర్ వైసీపీ నాయకులు చెల్లే డేవిడ్ ఆధ్వర్యంలో పలువురు గ్రామ వైసీపీ శ్రేణుల మండపేట లో వేగుళ్ళ పట్టాభి రామయ్య ను కలసి పులమాలలు, పూల మొక్క సమర్పించి అభినందించారు. అంగర గ్రామానికి చెందిన పితాని శ్రీనివాస్, నాతి పట్టాభి, టేకి వైసీపీ అధ్యక్షుడు కుక్కల బాలయ్య, దంగేటి రాంబాబు, కొవ్వాడ అప్పన బాబు, తవిటిక రత్న కుమార్, తదితర వైసీపీ నాయకులు, పట్టాభి అభిమానులు కలిసి అభినందనలు తెలిపారు.