విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:
ఆలమూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా కె.దీప దివ్య కృప బాధ్యతలు స్వీకరించారు. ఈమె విజయనగరం నుంచి ఆలమూరుకు బదిలీపై వచ్చారు. గతంలో పనిచేసిన అమరంగేశ్వరరావు బదిలీపై వెళ్లడంతో గత రెండు నెలలుగా ఇక్కడ న్యాయమూర్తి పోస్టు ఖాళీగా ఉంది. సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి ని పలువురు న్యాయవాదులు అభినందించారు.