విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం :విశ్వం వాయిస్: పెరిగిన విద్యుత్ ఛార్జీలు ప్రజలకు వివరిస్తూ మెర్లపాలెం లో తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించింది . పెరిగిన విద్యుత్ చార్జీలతో ప్రజల పై పడుతున్న భారం నిత్యావసర సరుకుల పెరుగుదల డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధర పెరుగుదలతో పాటు సిమెంటు ఐరన్ ఇసుక ధరల పెరుగుదలతో ప్రజలపై పడుతున్న భారాన్ని వివరిస్తూ గడప గడపకు ప్రచారం నిర్వహించారు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కొత్తపేట నియోజవర్గ ఇన్చార్జి బండారు సత్యానందరావు ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో అంకంపాలెం మాజీ సర్పంచ్ కరుటూరి నరసింహారావు మెర్లపాలెం సర్పంచ్ మెర్ల శ్రీరామచంద్రమూర్తి లొల్ల సర్పంచ్ కాయల జగన్నాథం మెర్లపాలెం టిడిపి అధ్యక్షుడు మల్లవరపు నాగరాజు టిడిపి నాయకులు గండ్రొతు నాగేశ్వరరావు, మెర్ల లక్ష్మీపతి రెడ్డి కొండయ్య పువ్వుల నాగరాజు పెండం వెంకన్న పంచదార నాగరాజు తదితరులు పాల్గొన్నారు.