విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:
ఆత్రేయపురం: విశ్వం వాయిస్ న్యూస్: మండలం లో మంజూరు అయిన సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలను మండల తాహశిల్దార్ ఎం రామకృష్ణ, ఎంపీడీఓ నాతి బుజ్జి బుధవారం ఉచ్చిలి, ఆత్రేయపురం ,నార్కెడ్ మిల్లి గ్రామాలలో పరిశీలించి, పనులను ప్రారంభించడానికి స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులతో కలిసి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఇంజనీరింగ్ సిబ్బందికి పలు సూచనలు చేసారు. ప్రభుత్వ భవనాలు నిర్మాణాలు వెంటనే మొదలుపెట్టాలనీ, వివిధ దశలలో ఉన్న భవనాలను పూర్తి చేసి, సంబంధిత ప్రభుత్వ శాఖలకు అప్పగించాలనీ తెలిపారు. ఉచ్చిలి లో హెల్త్ క్లినిక్ నిర్మాణం కొరకు ఐదు సెంట్ల స్థలాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చిన నంబూరి సూరపరాజు గారి అబ్బాయి శ్రీనురాజును ఈ సందర్భంగా తాహశిల్దార్ మరియు ఎంపీడీఓ అభినందించారు… ఈ పరిశీలనలో ఏఈ వీరభద్రరావు, టెక్నికల్ అసిస్టెంట్ ప్రసాద్, సర్పంచులు ఉర్రింకల మీరమ్మ త్రిమూర్తులు, పాలా నాగేశ్వరరావు , నాయకులు నంబూరి పద్మరాజు, భీమ్ సేన్, పాల్గొన్నారు.