– ప్రిన్సిపాల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన
శశిధర్
-కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కృతిక్స్ శుక్లా, జాయింట్
కలెక్టర్ ఇలక్కీయా
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 26 జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక కలెక్టరేట్ కోర్టుహాల్ నుంచి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఇలక్కియ.. అధికారులతో కలిసి హాజరయ్యారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు; ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణాలైన గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్‌బీకేలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు; జగనన్న స్వచ్ఛ సంకల్పం తదితరాలపై గోపాలకృష్ణ ద్వివేది చర్చించారు. ప్రస్తుతం ప్రభుత్వ శాశ్వత భవన నిర్మాణాలకు, ఉపాధి హామీ పనులకు అనువైన వాతావరణం ఉన్నందున
కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.