విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
ల
అమలాపురం ( విశ్వం వాయిస్ న్యూస్):
భానుడి భగభగలతో ఎండలు మండి పోతుండటంతో ప్రయాణికులు అల్లాడి పోతున్నారు వారికోసం కోనసీమ జిల్లా అమలాపురం మండలం చిందర గడువు కు చెందిన ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో
మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు , కలెక్టరేట్ కార్యాలయం కి వచ్చిన వారందరికీ చక్కని రుచికరమైన మజ్జిగను అందించి గొంతు తడిపారు.అటు ముక్తేశ్వరం , ఇటు అమలాపురం
వైపు వెళ్లే రోడ్డులోను వాహన దారుల దాహర్తిని తీర్చారు. మండుటెండలో ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ వాహనాలు ఆపి మజ్జిగ అందజేశారు. కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్ల ఎం పి టి సి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు.