విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అల్లవరం:
అల్లవరం విశ్వం వాయిస్: కోనసీమ జిల్లా అల్లవరం మండలం అల్లవరం గ్రామంలో మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరావు పలు సమస్యలపై ఉపాధి కూలీలు కలిసి చర్చించారు.ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలని,ఒక్కో రోజు కూలి వేతనం 600 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఉపాధి పనులను రెండు పూటలా నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పాలమూరి సత్యనారాయణ, పెనుమాల నాగరాజు,జల్లి గంగా భవాని,గిడ్ల వెంకటలక్ష్మి, బడుగు వెంకటేశ్వరావు,సాపే రాంబాబు ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.