విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అల్లవరం:
అల్లవరం విశ్వం వాయిస్: మండలంలో బోడసకుర్రు గ్రామ కమిటీ అధ్యక్షులు చింతా శ్రీను అధ్యక్షతన బాదుడే,బాదుడు కర పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికిఅమలాపురం మాజీ శాసనసభ్యులు,అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.గ్రామంలోని ప్రతి ఇంటింటికి,దుకాణలకి వెళ్లి బాదుడే బాదుడు కరపత్రాలు పంచి పెంచిపెడుతూ ప్రజలకు జగన్ ప్రభుత్వం అధిక ధరలు పెంచి ప్రజల నుండి ఏ విధంగా దోచుకుంటుందో వివరించారు. జగన్ పాలనంత బాదుడే బాదుడు గా సాగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దెందుకూరి సత్యనారాయణ రాజు, కొపనాతి తాతాజీ,గొల్లకోటి చిన్న,మాత్యాల బాబీ, యలకత్తూరి గోపాలం,రొక్కల సత్యనారాయణ,మట్టపర్తి శ్రీను, కారాడి లక్ష్మణ్,బసవని వెంకటేశ్వరావు,బొంతు సుబ్బయ్య, ధర్మడి నాగరాజు,మల్లిపూడి నవీన్,మొయిల గణపతి,జల్లి బుజ్జి,ఇసేనేపల్లి వీరబాబు,కార్యం చిన్నిబాబు,పోతుల చంటి, పోతడి అదిబాబు,కాలాడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు….