విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
( విశ్వం వాయిస్ న్యూస్ )
కాకినాడ :మానవసేవే మాధవ సేవ అని కాకినాడ మేయర్ సుంకర శివ ప్రసన్న అన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, కాకినాడ శాఖ అధ్వర్యంలో బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా.ఉమర్ ఆలిషా స్వామి వారి విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలి వెంద్రం, పశువుల చలివెంద్రాలను శివ ప్రసన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, కాకినాడ నగర మేయర్ సుంకర శివ ప్రసన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివ ప్రసన్న మాట్లాడుతూ పీఠాధిపతి ఉమర్ అలీషా మనుషులకు చలివెంద్రం ఏర్పాటు చేయుటయే కాక, పక్షులకు, పశువులకు కూడా చలి వెంద్రాలు ఏర్పాటు చేయుట అభినందనీయమని శ్లాఘించారు.
ఆధ్యాత్మిక సేవతో పాటు, సామాజిక సేవ చేస్తున్న పీఠాధిపతి డా. ఉమర్ అలీషా మహోన్నతుడు అని అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో పీఠం సెంట్రల్ కమిటీ సభ్యుడు AVV సత్యనారాయణ, కాకినాడ ఆశ్రమ కమిటీ సభ్యులు పేరూరి బాబ్జీ, అన్నపూర్ణ, మరిసే నాగేశ్వర రావు మాస్టారు , బాదం లక్ష్మీ కుమారి, రెడ్డి సూర్య ప్రభావతి, కాకినాడ లక్ష్మి, వనుము మణి, అమటం సీతా వర లక్ష్మి, వుప్పల నూకరత్నం కార్యక్రమంలో పాల్గొన్నారు. మేయర్ శివ ప్రసన్న కవి శేఖర డా. ఉమర్ అలీషా స్వామి వారి విగ్రహానికి పుష్ప మలాంకృతుల్ని చేశారు అనంతరం జరిగిన విశ్వ ప్రార్థనలో పాల్గొన్నారు .