సుబ్రహ్మణ్యం….
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: రాయవరం మండలం ప్రజా పరిషత్ లో ఖాళీగా ఉన్న 2 వైస్ ఎంపీపీ స్థానాలకు కు గురువారం ఎన్నిక నిర్వహించారు . ఎన్నికల ప్రత్యేక అధికారి గా నియమించబడిన రామ కృష్ణ పర్యవేక్షణలో ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయం సమావేశం హాల్లో ఎంపీటీసీ తో సమావేశమయ్యారు. ముందు గా హాజరైన సభ్యుల కు ఎన్నికల నిబంధనలు ప్రత్యేక అధికారి వివరించారు. అనంతరం మొదటి వైస్ ఎంపీపీ ఎంపీపీ గా మాచవరం ఎంపిటిసి కొవ్వూరి అమ్మి రెడ్డిని , రెండో వైస్ ఎంపీపీ గా వెంటూరు ఎంపీటీసీ 1 గుబ్బల బాలసుబ్రహ్మణ్యం లను ప్రతిపాదించ గా మిగిలిన సభ్యులు ఆమోదించారు. మండల పరిషత్ లో అధికారం పార్టీ 15, టిడిపికి రెండు, జనసేన సభ్యులు ఉండగా టిడిపి జనసేన సభ్యులు హాజరు కాలేదు. వైస్ ఎంపీపీ గా ఎన్నికైన అమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యుని ఎంపిటిసిలు సత్కరించి పుష్పగుచ్చాలు. అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ వి అరుణ పాల్గొన్నారు.