– గోడ పత్రికను ఆవిష్కరించిన సీపీఐ జిల్లా నాయకత్వం
– 9 న ఉదయం 6 గంటలకు స్టేషన్ కు వందలాది మంది
తరలి రావాలని పిలుపు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం , విశ్వం వాయిస్ః
పెరుగుతున్న పెట్రోల్ ,డీజిల్ ,గ్యాస్ ధరలు తగ్గించాలని, వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, కరెంటు చార్జీలు తగ్గించి ఆస్తి పన్ను, చెత్త పన్ను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 9న చలో అమరావతి కార్యక్రమం తల పెట్టడం జరిగిందని అన్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు.
గురువారం స్థానిక సిపిఐ కార్యాలయం లో గోడ పత్రికను నగర కార్యదర్శి నల్ల రామారావు, జట్లు సంఘం అధ్యక్షులు కె .రాంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొండలరావు తదితరులు ఆవిష్కరించారు .ఈ సందర్భంగా మధు ,రామారావు లు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ,రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు పదే పదే అధిక ధరలు, పన్నుల బారాలు ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు .
రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల వల్ల అన్ని రకాల వస్తువులపై పెనుభారం పడుతుందని వారన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలు బిల్లు తలొగ్గి జగన్ ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచిందని దీనిపై ప్రభుత్వం పునర ఆలోచన చేసి వాటిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు .ఈ నెల 9న జరగబోయే చలో అమరావతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రం లో ఏఐటీయూసీ నగర కార్యదర్శి కిర్ల కృష్ణ ,సిపిఐ నాయకుల బద్రరావు ,రామారావు , ఎఐఎస్ ఎఫ్ నాయకురాలు కడియాల సరిత తదితరులు పాల్గున్నారు.p