విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:
అమరావతి, విశ్వం వాయిస్ః
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగ్ పూర్ డివిజన్ పరిధిలో 1044 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ట్రేడ్ లవారిగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే నాగ్ పూర్ డివిజన్ లో 980 ఖాళీలు, మోతీబాగ్ వర్క్ షాప్ నాగ్ పూర్ లో 64 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన, ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదవతరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. లేదంటే తత్సమాన మైన గుర్తింపు పొందిన సంస్ధ నుండి సంబంధిత ట్రేడ్ లలలో ఐఐటీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 15 నుండి 24 సంవత్సారల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేది జూన్ 3, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు www.secr.indianrailways.gov.in పరిశీలించగలరు.