విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః
తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులు సమీక్ష సమావేశానికి హాజరైన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డా. నాగేశ్వరరావుకి జిల్లా కలెక్టర్ డా కె. మాధవి లత, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ ఇతరులు స్వాగతం పలికారు. మంత్రితో పాటు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి. వీరపాండ్యన్ రావడం జరిగింది.
మంగళవారం ఉదయం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకున్న మంత్రికి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ స్వాగతం పలికారు. మంత్రి కి స్వాగతం పలికిన వారిలో రుడా ఛైర్ పర్సన్ ఎమ్. షర్మిలారెడ్డి, రాజమహేంద్రవరం ఆర్డిఓ ఏ చైత్ర వర్షిణి, పౌరసరఫరాలు జిల్లా మేనేజర్లు టి. తులసి (తూర్పుగోదావరి), ఈ. లక్ష్మి రెడ్డి (కాకినాడ), ఆర్. తనూజ (కోనసీమ), జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రసాద్, తదితరులు ఉన్నారు.