– జిల్లా కలెక్టర్ మాధవిలత
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం ( విశ్వం వాయిస్ః)
ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం
ఫిజిక్స్-2, ఎకనామిక్స్.2 పరీక్షలకు ఇంటర్ విద్యార్ధులు 15,516 మంది ఓకేషనల్ విద్యార్థులు 1,639 మంది పరీక్షలకు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత మంగళ వారం ఒకప్రకటనలో తెలియచేశారు.
కలెక్టర్ మాధవీలత వివరాలు తెలుపుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాల లో ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షా కోసం ఈరోజు 15,896 మందికి గాను 15,516 మంది , ఒకేషనల్ కోర్సు రెండవ ఏడాది పరీక్షలకు 1,787 కి గాము 1,639 మంది హాజరయ్యారని తెలిపారు. రాజమండ్రి డివిజన్ పరిధిలో 32 కేంద్రాలలో ఇంటర్ కి 11,370 మందికి గాను 11,112 మంది హాజరు కాగా 258 మంది హాజరు కాలేదన్నారు. ఒకేషనల్ కోర్సు కి సంబందించిన 1,013 కి గానీ మందికి గాను 923 మంది హాజరు కాగా 90 మంది హాజరు కాలేదని తెలిపారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో పరిధిలో 17 కేంద్రాలలో ఈరోజు ఇంటర్ పరీక్షలకి 4,526 మందికి గాను 4,404 మంది హాజరు కాగా 122 మంది హాజరు కాలేదన్నారు. ఒకేషనల్ కోర్సు కి సంబందించిన 774 కి గానీ మందికి గాను 716 మంది హాజరు కాగా 58 మంది హాజరు కాలేదని తెలిపారు.