Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

క్వారీ లీజు దారులు రక్షణ గోడ నిర్మించాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– రక్షణ గోడ నిర్మాణానికి అనుకూలత వ్యక్తం చేసిన అధికారులు జిల్లా కలెక్టర్ మాధవిలత

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:

 

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః

రామదాస్ పేట ప్రాంతంలో గతంలో క్వారీలు లీజు తీసుకుని కార్యకలాపాలను నిర్వహించిన కాంట్రాక్టర్లు ఆ ప్రాంత ప్రజల భద్రత కోసం రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో రాందాస్ పేట క్వారీ లీజు దారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సమీపంలోని రామదాసు పేట లో పలు క్వారీ లీజుదారులు 1992 నుండి 2015 ఈ మధ్యకాలంలో క్వారీ తవ్వకాలు చేపట్టి ఉన్నారు. సదరు సమయంలో క్వారీ లీజుదారులు సుమారు వివిధ సర్వేలలో 50 లీజులకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. తదుపరి కాలంలో ఆయా లీజులు పూర్తి కావడంతో క్వారీలు నిర్వహించిన ప్రాంతంలో ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టి ఉండలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో రక్షణ గోడ లేకపోవడంతో స్థానికంగా నివాసం ఉండే కుటుంబాలు అభద్రతను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ దృష్ట్యా రామదాస్ పేట లో క్వారీ ప్రాంతంలో మార్గదర్శకాలు మేరకు క్వారీ లీజుదారులు రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలన్నారు . కలెక్టర్ విజ్ఞప్తి పై స్పందించిన లీజుదారులు రక్షణ గోడ నిర్మాణానికి ముందుకు వచ్చారు. ప్రభుత్వ పరంగా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. స్థానికంగా కొంత మంది నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని, లీజుదారులు కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా, రెవెన్యూ , ఇతర అధికారులను పంపించి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ మాధవిలత తెలిపారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, ఆర్ డి ఓ ఏ. చైత్ర వర్షిని, ఏడి మైన్స్ ఎమ్. విష్ణు వర్ధన్, క్వారీ లీజుదారుల ప్రతినిధులు సిహెచ్. కృష్ణాజి , శ్రీహరి రెడ్డి , పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement