Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

దళారి దోపిడి వ్యవస్థకు స్వస్తి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– ప్రతి ధాన్యం గింజ అర్బికెలు ద్వారానే కొనుగోలు చేయాలి
– మూడు జిల్లాల పౌర సరఫరా శాఖాఅధికారులతో మంత్రి కారుమూరు సమీక్షా
– ధాన్యం సేకరణ, పిడిఎఫ్ పై అధికారులకు దిశా నిర్దేశం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:

 

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః

రైతు పండించిన ధాన్యాన్ని ఆర్ బి కే ల ద్వారానే కొనుగోలు చేయాలని, ఈదిశలో ముఖ్యమంత్రి సంస్కరణ తీసుకుని రావడమే కాకుండా, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డా కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.

మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎండి వీరపాండియన్, ఎంపీ భరత్ రామ్ శాసనసభ్యులు జక్కంపూడి రాజా లతో కలసి సివిల్ సప్లై లీగల్ మెట్రాలజీ తదితర శాఖలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతుల నుంచి ఆర్ బి కే లు ధాన్యం కొనుగోలు చేయాలని, సంబంధించిన ఆర్ బి కే నుంచి మిల్లుకు ధాన్యం సరఫరా చేయాలన్నారు. దాన్యం కొనుగోలు విషయంలో రైతులకు సరైన మద్దతు ధర లభించే లాగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పండించిన ప్రతి ధాన్యం గింజ అర్భీకెలు ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. దళారీ వ్యవస్థ, మధ్య మధ్యవర్తిత్వం లేకుండా రైతులకు మద్దతు ధరవచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతుకు కొనుగోలు చేసే మిల్లర్ మధ్య ఎటువంటి లావాదేవీలు లేకుండా చూడాలన్నారు. మిల్లర్ కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు డేటా ఎంట్రీ చెయ్యడం ద్వారా 21 రోజుల్లో రైతుల ఖాతాకు నగదు జమ అవుతుందని కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. డేటా ఎంట్రీ విషయంలో జాప్యం లేకుండా చూడాలని, ఈ విషయం లో అధికారులు గానీ, మిల్లర్ లు కానీ ఉద్దేశ్య పూర్వకంగా జాప్యం చేస్తే కటినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో 37 వేల లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటివరకు 10.16 వేల మెట్రిక్ టన్నుల లక్ష్యం పూర్తి చేసిన ట్లు పేర్కొన్నారు. రైతులు నుంచి కొనుగోలు చేసిన ధాన్యం లో తేమశాతం ఎక్కువ ఉంటే అరపోత చేసి, అర్భికే లు ద్వారా కొనుగోలు చేసి, రైతుకు భరోసా ఇవ్వాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ ప్రతినెలా 15 వ తేదీ నాటికి పూర్తి చెయ్యాలని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ లో ఎమ్ ఎస్ ఎల్ పాయింట్ నుంచి ఎఫ్ పి షాప్ కి సరుకుల సరఫరా చేస్తున్న సమయంలో తగ్గుదల పై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిమితం చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎమ్మార్పీ ధరలు కంటే ఎక్కువ కు అమ్మకాలు జరిపే వారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. మాల్స్, తదితర చోట్ల వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారని, అటువంటి వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వహణ, వ్యాపార సంస్థలలో తరచుగా విజిలెన్స్ దాడులు చేపట్టాలన్నారు.

పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ మాట్లాడుతూ ఆర్ బి కే ల ద్వారా రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి నిర్ణీత సమయంలోనే వారికి ఎకౌంట్లో సొమ్ము జమ చేసే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు రైతుల యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు ఆన్లైన్లో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.

పౌరసరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ జి. వీరపాండియన్ సమీక్షిస్తూ ఈ ఏడాది ఇప్పటి వరకు ఆర్ బి కె ద్వారా ధాన్యం కొనుగోలు లక్ష్యాలకు అనుగుణంగా చేయడం జరిగిందన్నారు. ప్రతి రైతు వారు పండించిన ధాన్యాన్ని ఆర్ బి కె లోని దాన్యం కొనుగోలు సెంటర్ ద్వారా మాత్రమే మిల్లర్లకు పంపించే విధంగా రైతులకు సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ధాన్యం తేమ శాతాన్ని ఆర్ బి కే లోనే పరీక్షలు చేయాలని అలా కాకుండా మిల్లర్లు వద్ద చేసినట్లు నా దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గన్ని బ్యాగ్స్ ,హమాలీ, ట్రాన్స్ పోర్టు వివరాలను ఫోన్ నెంబర్ తో బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయిలో ఉన్న కమాండ్ కంట్రోల్ కు అనుసంధానంగా ఉండాలన్నారు. సివిల్ సప్లై అధికారులు ప్రతిరోజు 20 మంది రైతుల నుండి సమస్యలను తెలుసుకునే విధంగా పర్యవేక్షణ చేయాలన్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేసే పీడీఎస్ బియ్యం వాహనాలు ఉదయం 7 గం. కే వారికి కేటాయించిన ప్రదేశాల్లో ఉండి ఇచ్చిన సమయానికే పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్, బియ్యం గొడవల పై జాయింట్ కలెక్టర్లు, ఆర్ డి ఓ, తాసిల్దార్ లు పర్యవేక్షణ చేయాలని అన్నారు. బఫర్ గోడౌన్ ఎంఎల్ఎస్ పాయింట్ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.డీలర్ షాప్ కి చేరే బియ్యంలో తక్కువ కాకుండా ఉండేలా నిఘా వుంచాల న్నారు.

రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి పలు విషయాలను రైతులకు వివరించి అర్భికే ద్వారా లావాదేవీలు జరిపేలా అవగాహన కల్పిస్తున్నామని ఆయన సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. మన ప్రభుత్వం హయాంలో రైతులకు మద్దతు ధర కల్పిస్తూ, వ్యవసాయానికి భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ జి. వీరపాండియన్, ఎంపీ మార్గాన్ని భరత్ రామ్, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, రుడా కార్పొరేషన్ చైర్మన్ షర్మిలారెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీధర్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్లు ఈ. లక్ష్మి (కాకినాడ) శ్రీ తనూజ (కోనసీమ టీ తులసి (తూర్పుగోదావరి) మూడు జిల్లాల వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు, సివిల్ సప్లై డి ఎస్ ఓ లు, లీగల్ మెట్రాలజీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement