పంపిణీ
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ గ్రామీణం, విశ్వం వాయిస్ః
జగన్నాధపురం యానాం రోడ్డులోని ఆంధ్రా పాలిటెక్నిక్ చివరి గేటు ఎదురుగా యాగ్నేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యావేత్త ప్రవీణ్ చక్రవర్తి ఆర్థిక సహకారంతో తూరంగి, జగన్నాధపురం పరిసర ప్రాంతాల్లో ని నిరుపేద రిక్షా కార్మికులు 50 మందికి నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, కాయగూరలు పంచడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవసాపకుడు యాగ్నేష్ మాట్లాడుతూ 2007 లో సంస్థను స్థాపించామని, అప్పటి నుండి విరామం లేకుండా బీదలకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రిక్షా కార్మికులకు నిత్యావసర సరుకులు, కాయగూరలు పంచిపెట్టటం జరిగిందని అన్నారు. కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన ప్రవీణ్ చక్రవర్తి కు కృతజ్ఞతలు తెలియజేశారు. చేతనైనంత సహాయం చేయటంలో వున్న తృప్తి మరి దేనిలోనూ లేదన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి అనిత, వేదీష్, విదిత్వ, రిక్షా కార్మిక సంఘం అధ్యక్షులు బొందల దేముడు, కార్యదర్శి నెల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.