Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నాటుసారా వ్యాపారం వద్దు” మీ కుటుంబ బాధ్యతలు మీకు ముద్దు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆలమూరు: పరివర్తన కార్యక్రమంలో పాల్గొన్న
అధికారులు, రాజకీయ నాయకులు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:

 

 

ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్):

ప్రజారోగ్యానికి హానికరమైన నాటుసారాను నామ రూపాల్లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో ఆపరేషన్ పరివర్తనతో ఎస్ఈబి శాఖ గంజాయిని నియంత్రించిందని, మరల ఆపరేషన్ పరివర్తనతో నాటుసారాను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపతునామని ఆలమూరు సర్కిల్ ఎస్ఈబి ఎస్ఐ అన్నవరం అన్నారు. ఎస్ఈబి ఎస్ఐ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, సర్పంచ్ దంగేటి చంద్రకళ సమక్షంలో పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎస్సై మాట్లాడుతూ పూర్తిస్థాయిలో నాటుసారాను నిర్మించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని, క్షేత్ర స్థాయిలో నాటుసారాను పూర్తిగా నిర్మూలించే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. నాటుసారా ప్రభావిత గ్రామాలను నాటుసారా రహిత గ్రామాలుగా మార్చాలని ప్రణాళిక సిద్ధం చేసామని అందుకు ప్రజల సహకారం కావాలని అన్నారు. ఆలమూరు ఎస్ఈబి సర్కిల్ పరిధిలో నాయకులు,

గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నాటుసారా వినియోగం వలన ప్రజలు ఎలా అనారోగ్యం

పాలవుతున్నది వివరించి, అక్రమ వ్యాపారాలకు స్వస్తి పలకాలని అన్నారు. నాటుసారా తయారీ, అమ్మకం దారులపై పీడీ యాక్టు, రౌడీ షీట్ తదితర కేసులు నమోదు చేస్తామని, నిందితులు ఎదుర్కొనే సమస్యలు, నాటుసారా తాగితే తలెత్తే దుష్పరిణామాలను తెలియజేసి వారిలో చైతన్యం తీసుకొని వస్తున్నామనారు. నాటుసారా తయారీకి ముడిసరుకుగా వినియోగించే నల్లబెల్లం విక్రయదారుల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని అన్నారు. అలాగే చొప్పెల్ల గ్రామంలో నాటుసారాను పూర్తిస్థాయిలో అరికట్టి నాటుసారా రహిత గ్రామంగా ప్రకటించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఎస్ఈబి పోలీసులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement