విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అనపర్తి:
నల్లమిల్లి ( విశ్వం వాయిస్ న్యూస్ )
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ఈరోజు రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలో రెండవ రోజు అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రతి గడప గడపకు తిరుగుతూ స్థానిక ప్రజల సమస్యలను సంబంధిత సచివాలయం సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకుని సాధ్యమయినంత త్వరలో పరిష్కరించి వారికి అందేలా చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించి ప్రభుత్వ పథకాలు అన్నీ సక్రమంగా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి గ్రామ సర్పంచ్ నల్లా పద్మ దుర్గాప్రసాద్, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ మట్ట శ్రీను, జడ్పిటిసి పేపకాయల రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, కంచుమర్తి సాయిబాబు, అనపర్తి మండలం జడ్పిటిసి సత్తి గీతావరలక్ష్మి వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అడబాల వెంకటేశ్వర రావు, పొలమూరు గ్రామ ఉప సర్పంచ్ సత్తి సూరారెడ్డి, బిక్కవోలు మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి (బుజ్జి), రంగంపేట మండలం మైనారిటీ సెల్ అధ్యక్షులు SDF భాషా, సింగంపల్లి ఎంపీటీసీ మేడిశెట్టి సుబ్బన్న, పాలాటి నాగేశ్వరరావు, తాడి ఆదిరెడ్డి, గొల్లపల్లి రవి, కంచుమర్తి సోమరాజు, కొండేపూడి సత్తిబాబు, నర్ల చక్రరావు, సి.గౌరి శంకర్, మరియు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.