విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు( విశ్వం వాయిస్ న్యూస్):
మండలం పరిధిలో చెముడులంకలో నిర్మించిన శ్రీ రుక్మిణీ దేవి సమేత శ్రీ కృష్ణ స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా బుధవారం నుండి యజ్ఞ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన టిటిడి పూర్వపు పండితులు శ్రీమాన్ ఖండవిల్లి రాధాకృష్ణ మాచార్యుల ఆద్వర్యంలో 12మంది వైశాసన పండితులచే ప్రతిష్ఠా యజ్ఞ మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. పలువురు దంపతులు సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురువారం కూడా యజ్ఞ పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా వేలాదిమంది భక్తులతో హోమాది కార్యక్రమాలు జరుపబడతాయి.అలాగే కమిటీ ఆద్వర్యంలో భారీ అన్నసమారాధన నిర్వహిణకు ఏర్పాట్లు చేస్తున్నారు.