– బిజెపి నేతలు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )
కాకినాడ, మే 27: కాకినాడ నగర అభివృద్ధికి గడిచిన మూడేళ్ళకాలంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది. అలాగే పేదలకు ఇచ్చేందుకు ఒక సెంటు స్థలం లేదని చెప్పి వైకాపా కార్యాలయం కోసం రెండు ఎకరాల స్థలం కౌన్సిల్ ఆమోదం పొందటం ఏంటంటూ బిజెపి నాయకులు ప్రశ్నించారు.
శుక్రవారం బిజెపి రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యుడు గట్టి సత్యనారాయణ స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గట్టి మాట్లాడుతూ కాకినాడ నగరంలో పేదలకు ఇవ్వడానికి స్థలంలేదని వైకాపా కార్యాలయానికి రెండు ఎకరాలను, జిపిటిలో ఐదు ఎకరాలు ప్రైవేట్ ఆసుపత్రి నిర్మాణం చేసేందుకు కౌన్సిల్ సమావేశం ముందుకు తీసుకు వచ్చారన్నారు. ఇదేవిధంగా ప్రభుత్వ ఖాళీ స్థలాలు, ఆస్తులు ప్రైవేట్ వారికి అందిస్తే ఇక ఏమీ మిగలవన్నారు. వైకాపా అధికారంలో ఉండి రెండు ఎకరాల స్థలం కాకినాడ నగరంలో కొనుగోలు చేయకపోవడం చాలా బాధాకరన్నారు. కాకినాడ నగరంలో ప్రజలకు మంచినీటి సరఫరాలో వైఫల్యం ఉందని దాన్ని సరి చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, పరికరాల కొరత ఉందని దానిపై దృష్టి సారించి ఆ సమస్యను పరిష్కరించాలని సూచించారు.
బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో పేదలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సెంటు భూమి లేదని చెప్పిన ప్రభుత్వం పెద్దలు వారి అవసరాలకు భూమిని ఎలా తీసుకొస్తున్నారంటూ ప్రశ్నించారు. మూడేళ్ల కాలంలో కాకినాడ నగర అభివృద్ధికి ప్రభుత్వ ఖజానా నుండి ఎమ్మెల్యే నిధులు లేకపోయారని, కాకినాడ నగరంలో మడ అడవులు మూసి వేయడం వల్లనే కాకినాడ నగరం ముంపు బారిన పడుతున్నట్లు రవికిరణ్ చెప్పారు.
రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్లో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీలు కలిసిపోయి వారికి అవసరమైన పనులను ఆమోదించుకుని లాభం పొందుతున్నారన్నారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి, మాజీ ఎమ్మెల్యే కొండబాబులు కలిసి కాకినాడ నగర సమస్యలు పక్కదారి పట్టించి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారన్నారు. ఏపీ టిడ్కో ఇళ్లను పదేళ్ల నుండి పూర్తి చేయకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారో బహిర్గతం చేయాలన్నారు. ఈ విషయంపై బిజెపి క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తుందన్నారు. కోనసీమలో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ ఇది అధికార పార్టీ కుట్రలో భాగమని కావాలనే అక్కడ వైషమ్యాలను, విద్వేషాలను రేపుతుందని చెప్పారు.
ఈ సమావేశంలో బిజెపి నాయకులు దువ్వూరి సుబ్రహ్మణ్యం, కె గంగాధర్, చక్కా రమేష్, చరియన్, వెంకటేష్, శివ, త్రినాథ్ దేవ్ తదితరులు పాల్గొన్నారు.