విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )
కాకినాడ, జూన్ 7; కార్మికులను బానిసలు గా మార్చి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ లు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కాకినాడ కార్మిక శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్ మాట్లాడుతూ 1976 లో వచ్చిన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలన్నారు. మెడికల్ రిప్స్ ను హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్ గా గుర్తించాలని, కనీస వేతనం 26,000రూ. అమలు చేయాలని, మహిళా రిప్రజెంటేటివ్స్ కు 6 నెలలు జీతంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేయాలని, మెడికల్ రిప్స్ పై కంపెనీల వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ధర్నా అనంతరం కార్మిక శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు డి. వెంకన్న, కె. అప్పారావు, గుప్తా, సతీష్, నరేష్, వెంకటేష్, జయరాజ్, రామకృష్ణ మరియు సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు…