Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అపోలో లో బ్రెయిన్ ట్యూమర్ అత్యుత్తమ చికిత్స

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– న్యూరో సర్జన్ డా. ఎమ్.వి. కిరణ్ కుమార్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ , విశ్వం వాయిస్:

మెదడులో కణుతులకు(బ్రెయిన్ ట్యూమర్)కాకినాడ అపోలో ఆసుపత్రిలో అత్యుత్తమ చికిత్స అందించడం జరుగుతోందని న్యూరో సర్జన్ డా. ఎమ్.వి.కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక రాయల్ పార్క్ హోటల్ నందు అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈసందర్భంగా డా.కిరణ్ కుమార్ మాట్లాడుతూ బ్రెయిన్ ట్యూమర్ అతి ప్రమాదకర వ్యాధి అని అపోలో కాకినాడ హాస్పిటల్ లో అధునాతన సౌకర్యాలు కలిగి

అత్యుత్తమ చికిత్స అందిస్తున్నామన్నారు.ఈనెల ఎనిమిదో తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉచిత కన్సల్టెషన్ అందిస్తున్నామన్నారు.ఆకస్మికంగా తలనొప్పి, వాంతులు,చూపు మందగించడం, నీరసం,మాట ముద్దగా రావడం తదితర లక్షణాలను అనుసరించి బ్రెయిన్ ట్యూమర్ గా గుర్తించ వచ్చునని పేర్కొన్నారు. చిన్న పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. సీటీ ఎమ్మార్ఐ ద్వారా వ్యాధిని గుర్తించవచ్చునని తెలిపారు. గతంలో వ్యాధి గుర్తింపు కష్టతరమైన అంశంగా ఉండేదని,నేడు అత్యుత్తమ చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయన్నారు. నావిగేషన్ వ్యవస్థ ద్వారా వ్యాధి ఎక్కడ ఉన్నదో స్పష్టంగా గుర్తించవచ్చునన్నారు.తద్వారా వ్యాధిని సమర్ధవంతంగా నయం చేయవచ్చని తెలిపారు.వ్యాధి బాగా ముదిరిన తర్వాత రోగులు వస్తారని,ఆ పరిస్థితిలో రోగికి వైద్య సేవలు అందించడం కష్టతరమైన విషయమన్నారు. ఓపెన్ సర్జరీ అవసరం లేదని,అవసరమైన చోట చిన్న రంధ్రం ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి చికిత్స చేయవచ్చునన్నారు.చికిత్స అనంతరం రెండు మూడు రోజుల్లో పేషంట్ డిశ్చార్జ్ చేయవచ్చునని తెలిపారు.కొన్ని కేసుల్లో రేడియేషన్ అవసరం పడుతుందన్నారు. కేన్సర్ కారక, కేన్సర్ రహిత బ్రెయిన్ ట్యూమర్ శస్త్ర చికిత్సలు కాకినాడ అపోలో ఆసుపత్రిలో ఇప్పటివరకు సుమారుగా పది వేల మంది రోగులకు విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు.సాధారణ చికిత్సకి 1.5లక్షల రూపాయలు, క్రిటికల్ చికిత్స కు 3లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు వేయి కేన్సర్ కారక చికిత్సలు చేశామని అన్నారు. ఆహారపుఅలవాట్లు, వంశపారంపర్యంగా,సెల్ రేడియేషన్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్ రావడానికి అవకాశం ఉంటుందన్నారు. వ్యాధి గుర్తించిన వెంటనే తగిన చికిత్స పొందితే ఎక్కువ సమయం లేకుండానే క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లవచ్చునని, నిర్లక్ష్యం చేయడం వల్ల అధిక సమయం ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అర్ధోపెడిక్ డా.పి.పి.ఛటర్జీ, న్యూరో ఫిజిషియన్ డా.కె.శివరాం గాంధీ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో అపోలో డిప్యూటీ జనరల్ మేనేజర్ జీవిఆర్ మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement