విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:
ఆత్రేయపురం:విశ్వం వాయిస్:
బొబ్బర్లంక బ్యారేజీ సమీపంలో గోదావరి స్నానాలు చేస్తూ ఇద్దరు మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక బ్యారేజీ సమీపంలో చిక్కాల గ్రామం,చాగట్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన మధ్యాల సతీష్ వయసు19 ,అలాగే జంగారెడ్డిగూడెం చెందిన పొలిశెట్టి సిద్దార్థ 19, గోదావరి లో స్నానం చేస్తూ నీటిలో మునిగి చనిపోయినట్లు వివరించారు.ఈ సంఘటనపై ఏ ఎస్.ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.