విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం( విశ్వం వాయిస్)
అమలాపురం నియోజకవర్గం అమలాపురం రూరల్ మండలం నడిపూడి టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కుంపట్ల శ్రీనివాసరావు ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకోవడంతో ఆదివారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సమనస గ్రామ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్ వారి స్వగృహంలో కలిసి ఆరోగ్య సమాచారం తెలుసుకొని తొందరగా కొలుకోవాలని ఆకాంక్షించారు.అలానే అమలాపురం రూరల్ మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఆర్.ఎం.పి డాక్టర్ ఉందుర్తి వెంకటేశ్వరరావు ఇటీవల కారు ప్రమాదంలో ఆక్సిడెంట్ కు గురికావడం జరిగింది తీవ్ర గాయాలతో కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వెంకటేశ్వరరావు ని ఆదివారం పరమట శ్యామ్ కుమార్ హాస్పిటల్ కి వెళ్లి ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకున్నారు . అధికారి బాబ్జి,చిక్కాల అయ్యన్ననాయుడుబళ్ల రాజ్ కుమార్ పరమట శివ కుమార్ తదితరులు పరమర్శించినవారిలో ఉన్నారు.