విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:
ప్రవక్త ముహమ్మద్ (స) పై వస్తున్న అపోహలను దూరం చేసేందుకు జమాఅత్ ఇస్లామీ తరుపున రాష్ట్ర వ్యాప్తంగా “రండి ప్రవక్త ముహమ్మద్ కోసం తెలుసుకుందాం” పేరిట పరిచయ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు జమాతే రాష్ట్ర కార్యదర్శి హిమాయత్ తెలిపారు. మండపేట గాంధీ నగర్ చిన్న మసీదు వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ పరిచయ కార్యక్రమాన్ని జూన్ 24 నుండి జూలై 3 వరకు చేపట్టినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రవక్త వారిపై వస్తున్న విమర్శలు అక్షేపనీయమని అన్నారు.ఈ పరిచయ ఉద్యమం ద్వారా ప్రవక్త ముహమ్నద్ పై ప్రజలు కల్గి ఉన్న అపోహలను దూరం చేయడానికి జమాఅతె ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రవక్త వారి బోధనలను ప్రజలకు చేరవేసే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.అనంతరం ఈ ఉద్యమానికి సంబంధించిన పొస్టర్ ను ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇబ్రహీం షరీఫ్, స్దానిక జమాతె అధ్యక్షులు MD రిజ్వాన్, ప్రాంతీయ కార్యదర్శి అబులాలా, జమాతె సభ్యులు కార్యకర్తలతో కలసి ఆయన అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జమాతె మహిళా విభాగం SIO, IYM, GIO సభ్యులు పాల్గొన్నారు.