విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:
తన భర్త కనిపించడం లేదని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ మంగళవారం విలేకరులకు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రమైన రాయవరం గ్రామం ఇందిరా కాలనీ కి చెందిన వద్దిపర్తి వెంకన్న వంటలు చేస్తూ కుటుంబ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా మే 15న సాయంత్రం ఐదు గంటలకు వెంకన్న బయటికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఏదైనా వంటల పనిమీద ఏ ఊరు వెళ్లి ఉంటాడని భావించారు. కానీ ఇప్పటి వరకు కూడా తిరిగి రాకపోవడంతో బంధువులకు ఇండ్లకు వెళ్లి గాలించిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఏమీ చేయని దిక్కుతోచని స్థితిలో రాయవరం పోలీసులను ఆశ్రయించడంతో భార్య వద్దిపర్తి దుర్గా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.