చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే యువతకు మంచి భవిష్యత్తు
విశ్వంవాయిస్ న్యూస్, రాజానగరం:
రాజమహేంద్రవరం,విశ్వంవాయిస్ న్యూస్:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ముగ్గురికి,టీడీపీ ఎస్సీ సెల్ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి ఖండవల్లి లక్ష్మి అభినందనలు తెలిపారు.ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ తరపున పోటీ చేసి సంచలనం విజయం సాధించిన పంచుమర్తి అనురాధకు ఆమె ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు.శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా చంద్రబాబు పాలన కోరుకుంటున్నారని,రానున్నది టీడీపీ ప్రభుత్వంమని,చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.తమ రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ బలంగా, స్పీడుగా దూసుకుపోతున్నదని, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధైర్యంతో ఢీకొట్టే దమ్ము తమకే ఉందని ధీమా వ్యక్తంచేశారు.20 సంవత్సరాలుగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలు మోస్తున్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పై తప్పడు ఆరోపణలు చేస్తున్నవారికి తగిన గుణపాఠం చెబుతామని ఖండవల్లి లక్ష్మి హెచ్చరించారు.పెందుర్తి మనసుకు బాధ కలిగి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకున్నారు తప్ప పార్టీకి రాజీనామా చేయలేదని గుర్తు చేశారు.నియోజకవర్గంలోని మూడు మండలాల నాయకులు, కార్యకర్తలు పెందుర్తి వెంకటేష్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.బర్ల బాబురావు అనే అనామకుడు పెందుర్తిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అతడిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.నియోజక వర్గంలో పార్టీ బలపడిందని, పెందుర్తి అధ్యక్షతన నిన్న జరిగిన పార్టీ సమావేశం విజయవంతం కావడంతో మళ్ళీ బర్ల బాబురావు దొడ్డిదారిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.ఎల్.ఆర్.ఎస్. రిస్క్ బాయ్ పేరుతో తప్పుడు మెసేజ్ లు పెడుతున్నారని,బర్ల బాబురావుకు ధైర్యం ఉంటే నేరుగా వస్తే అతని సంగతి తేల్చేస్తామని ఖండవల్లి లక్ష్మి చెప్పారు.