విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
- అమలాపురం పట్టణంలో 13వ వార్డులో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మూడు కోట్ల నిధులు మంజూరు కి సీఎం హామీ ఈ రోజు ఏలూరు జిల్లా దెందులూరు లో జరిగిన మూడో విడత “వై యస్ ఆర్ ఆసరా” కార్యక్రమం కు విచ్చేసిన సియం జగన్ మోహన్ రెడ్డి గారిని మంత్రివర్యులు విశ్వరూప్ గారు సమక్షంలో వైస్ ఆర్ సిపి నాయకులు, తుని వైసిపి పార్టీ పరిశీలకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు గారు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంలో అమలాపురం సూర్యానగర్ కమ్యూనిటీ హాల్ శిదిలావ్యవస్థ కు చేరుకున్న విషయం సియం గారికి తెలుపగా, దానికి సానుకూలంగా స్పందించి 3 కోట్లు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. దీనికి గాను సియం జగన్ మోహన్ రెడ్డి గారికి చెల్లు బోయిన శ్రీనివాసరావు గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.