విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట:
*ప్రజ్ఞా వికాసం పరీక్ష పోటీలలో మండల స్థాయిలో ద్వితీయ స్థానాన్ని సాధించిన బొక్కా మహాలక్ష్మి*
యుటిఎఫ్ ఎస్ఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించారు
ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు, చేతులు మీదుగా బహుమతి ప్రధానం
అమలాపురం విశ్వం వాయిస్ రిపోర్టర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ,కొత్తపేట మండలం ప్రభుత్వ పాఠశాలలో యు .టి .ఎఫ్, ఎస్ .ఎఫ్ .ఐ సంయుక్తంగా మండల హైస్కూల్ స్థాయిలో 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞ వికాసం పోటీ పరీక్ష నిర్వహించినారు. ఈ పోటీ పరీక్షలో 12 ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొనగా, మండల స్థాయిలో రెండవ స్థానాన్ని తొత్తిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని బొక్కా మహాలక్ష్మి సాధించినది .ఈ విద్యార్థినికి తూర్పు పశ్చిమగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు బహుమతి ప్రధానం చేశారు .ఈ కార్యక్రమానికి యుటిఎఫ్, ఎస్ఎఫ్ఐ, జిల్లా మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. పోటీ పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసినారు.