విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
ఉపాధ్యాయుడు..కాదు…కీచకుడు
…విద్యార్థినిల పట్ల అసభ్య ప్రవర్తన
…బెడిసికొట్టిన పెద్దల పంచాయితీ
….ఉపాధ్యయుడు పై 8 ఫిర్యాదులు
….గత చరిత్ర కూడా కీచక పర్వమే
మామిడి కుదురు విశ్వం వాయిస్:
విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారి భవిష్యత్ ను బంగారు మయం చేయడానికి బదులు ఆ ఉపాధ్యాయుడు కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ఇది.బాధిత విద్యార్థిని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. …
అప్పనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పని చేస్తున్న పి.సురేష్ బాబు
విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విషయం
బయటకు రాకుండా స్థానిక పెద్దలు పీడీ చేత శెలవు పెట్టించి పంపివేశారు. సమస్య తాత్కాలికంగా సద్దు
మణిగిందనుకుంటున్న తరుణంలో సోమవారం పీడీ మళ్లీ విధులకు హాజరుకావడంపై
విద్యార్థులు, తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేయడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. పీడీ సురేష్ బాబు 6వ
తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో
విద్యార్థిని కుటుంబ సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి. సాయిబాబుకు
ఫిర్యాదు చేశారు. హెచ్.ఎం సాయిబాబు సమస్యను స్థానిక సర్పంచ్ గెడ్డం మంగాదేవి దృష్టికి
తీసుకు వెళ్లారు. దీంతో సర్పంచ్ పి.డి చే గతనెల 21వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు
శెలవు పెట్టించారు. మరలా ఈ నెల 24, 25 తేదీల్లో కూడా పీడీ శెలవు పెట్టారు.అయితే తిరిగి సోమవారం
నుంచి సురేష్ బాబు విధులకు హాజరుకావడంతో నివురు గప్పిన నిప్పులా ఉన్న సమస్య ఒక్కసారిగా
భగ్గుమంది. విద్యార్థిని నడుముపై చేయి వేయడం, వారికి తెలియకుండా వీడియోలు తీయడం,
ఈమె మీ పిన్ని అంటూ ఇతర విద్యార్థినిలకు పరిచయం చేయడం వంటి అనైతిక చర్యలకు పీడీ
పాల్పడ్డాడని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే పిల్లల్ని ఎలా పాఠశాలకు పంపుతామని,వారిని ఎలా
చదివించేదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పీడీ అసభ్య ప్రవర్తనకు సంబంధించి ఏడు నుంచి
ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయని చెబుతున్నారు.సోమవారం పేరెంట్స్
ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో
హెచ్ఎం
సోమవారం పి.డి ని స్కూల్ నుంచి పంపించి వేశారు. పి.డి సురేష్ బాబు గతంలో పెదపట్నంలంక
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేసిన సమయంలోనూ, ఇదే విధంగా అసభ్యంగా
ప్రవర్తించే వాడని చెబుతున్నారు. పి.డి సురేష్
బాబు వ్యవహారంపై హెచ్.ఎం సాయిబాబును
వివరణ కోరగా పేరెంట్స్ నుంచి ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమని, పి.డి ని మరలా సెలవుపై
పంపించామన్నారు. ఇక్కడి నుంచి పి.డి ని బదిలీ చేయిస్తామని గ్రామ సర్పంచ్ మంగాదేవితో
పాటు పెద్దలు హామీ ఇచ్చారని, సమస్యను ఉన్నతాధికారులకు నివేదించామని హెచ్.ఎం సాయిబాబు చెప్పారు.