చైన్ స్నాచర్ కు దేహ దేహశుద్ధి చేసిన ప్రజలు
మార్కెట్ వీధిలో జరిగిన ఘటన
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
తాళ్లరేవులోని స్థానిక మార్కెట్ వీధి సమీపంలో చైన్ స్నాచర్స్ హల్చల్ చేశారు. మార్కెట్ వీధిలో నడిచి వెళుతున్న ఒక వృద్ధురాలి మెడలో నుంచి చైను లాక్కునేందుకు ప్రయత్నించగా గమనించిన స్థానికులు దొంగలను పట్టుకుని దేహశుద్ధి చేసి అనంతరం స్థానిక కోరంగి పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి దొంగలను అరెస్టు చేసి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసినట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు.