చొల్లంగి పంచాయతీ కొబ్బరి చెట్టు పేటలో నిర్మించిన నూతన వాటర్ ట్యాంక్
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం చొల్లంగి గ్రామంలో కొబ్బరి చెట్టు పేటలో సుమారు 40 లక్షలతో ఓఎన్జిసి సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన 90 వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకును ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మన నియోజకవర్గంలో చాలావరకు తాగునీటి సమస్య చాలావరకు తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, గ్రామ సర్పంచ్ గంగాభవాని, ఎంపిటిసి కడియాల మహాలక్ష్మి, గ్రామ పెద్దలు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.