— ఆందోళనలో లంక గ్రామాల ప్రజలు
విశ్వంవాయిస్ న్యూస్, మామిడికుదురు:
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద నీరు చేరడంతో లంక గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.వైనతేయ నదిలోకి వరద నీరు క్రమేపీ పెరుగుతూ,తగ్గుతూ ఉండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.గత ఏడాది వరద నేర్పిన పాఠాలు అధికారులకు కనువిప్పు కలిగి ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.గోదారమ్మ పెరుగుతూ,తగ్గుతూ దోబూచులాడటం లంక వాసులకు ఆందోళన కల్గిస్తుంది.లంక గ్రామాల్లో పశువులకు ఆహారం కోసం రైతులు ముందస్తుగా పశుగ్రాసం సిద్దం చేసుకొని పనుల్లో నిమగ్నమై ఉన్నారు . గోదావరి మధ్య లంకల్లో ఉన్న పశువులను, పశుగ్రాసాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.గోదారమ్మ ఇకనైనా శాంతించు అంటూ లంక గ్రామాల ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు .