ఏడాదైనా అమలుకాని ముఖ్యమంత్రి హామీలు
విశ్వంవాయిస్ న్యూస్, రాజోలు:
గత సంవత్సరం రాజోలు, మేకలపాలెం ఏటీగట్టు ప్రాంతాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమైపోయాయి అని మాజీమంత్రి గొల్లపల్లి అన్నారు. మాజీమంత్రి గొల్లపల్లి రాజోలు మార్కెట్ వద్ద మేకలపాలెం వరద ప్రాంతాన్ని సందర్శించి వరద బాధితుల ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి గొల్లపల్లి మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే రోజుల్లో వరదలతో తల్లడిల్లిపోయిన ప్రజలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రాంతంలో కలసి అనేక హామీలు ఇచ్చి వరద తో ఇబ్బంది లేకుండా చేస్తానని, నివాస ప్రాంతాల్లో ఏటీగట్టు పొడవునా కాంక్రీట్ గోడ కట్టిస్తానని, ఏటీగట్టు పొడవునా రోడ్డు నిర్మాణం చేస్తాం అని, గోదావరి తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం అని హామీలు ఇచ్చి సంవత్సరం పూర్తి అయినప్పటికీ ఒక్క సిమ్మెంట్ బస్తా పని కూడా చెయ్యలేదని అన్నారు. ఇది కేవలం మాటల ప్రభుత్వం మాత్రమే అని చేతల ప్రభుత్వం కాదని అన్నారు. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని, వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పామర్తి రమణ, రావి మురళి, నార్కెడమిల్లి కనకం, అడబాల విజయ్, కడలి వెంకట రమణారావు, బోళ్ల రాజేష్, కరప భద్ర, పుల్లేటికుర్తి శివాజీ, గుడాల విశ్వనాధం,గుబ్బల కుమార్, పెస్సింగి ఏసు, అరుమిల్లి సాయిబాబు, అరుమిల్లి రాంబాబు, కట్టా భగవాన్ , పిన్నింటి ఆదినారాయణ, షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.