—- 1870 మంది భక్తులు అన్నదానం స్వీకరించారు.
విశ్వంవాయిస్ న్యూస్, మామిడికుదురు:
అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి దేవస్థానం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది . లడ్డూ ప్రసాదం విక్రయం, దర్శనము టిక్కెట్లు విక్రయం ద్వారా రూ.73,270/-లు మరియు నిత్యా అన్నదాన ట్రస్ట్ నకు రూ.40,901/-లు. వెరశి మొత్తం ఆదివారం ఒకరోజుకి గానూ రూ.1,14,171/-లు ఆదాయం వచ్చింది.శ్రీ స్వామి వారిని 2364మంది దర్శించుకోగా 1,870మంది అన్నప్రసాదం స్వీకరించారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి జి.మాధవి తెలిపారు, ఆలయ ఛైర్మన్ చిట్టూరి రామకృష్ణ, ధర్మ కర్తల మండలి సభ్యులు భక్తులకు కావలసిన ఏర్పాట్లు పర్యవేక్షించారు.