విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
అవినీతి రహిత పరిపాలన ఆంధ్రప్రదేశ్ అవసరం ప్రజా ప్రస్థానం ఆ అడుగులు దిశగా సన్నాహాలు
అన్ని వర్గాలకు మేలు చేయడమే ప్రజా ప్రస్థానం ప్రధాన లక్ష్యం…
– పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ముకుంద్ తోట
గత 13 సంవత్సరాలుగా విశాఖ జిల్లాలో స్వచ్ఛందంగా సేవలు అందించి అన్ని వర్గాల సంక్షేమానికి కృషిచేసిన తాను ప్రజా ప్రస్థానం పేరుతో రాజకీయ పార్టీ స్థాపించినట్టు ముకుంద్ తోట వెల్లడించారు. మా ప్రేమ ట్రస్టు ద్వారా విశాఖ జిల్లాలో కోవిడ్ సమయంలో సుమారు 60 లక్షల రూపాయలతో మందులు, శానిటైజర్లు, మాస్కులు అందించడంతో పాటు విస్తృతంగా సేవంలదించామన్నారు. ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు తమ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే క్రమంలో గడప గడపకు వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకోవాలని కార్యాచరణ చేస్తున్నామన్నారు. విద్యామృతం పథకం ద్వారా పేద పిల్లలకు పుస్తకాలు, ఫీజులకు ఆర్థిక సాయం, ప్రేమా మృతం ద్వారా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు రేషన్ సదుపాయం కల్పించామన్నారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో సుమారు 6 వేల మంది వలంటీర్లు తమ మా ప్రేమ సంస్థ ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నారని వివరించారు. అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు న్యాయవాదులు, ఇంజనీర్లు, విద్యావేత్తలు, మేధావులను రాజకీయాల్లోకి ఆహ్వానించి వారికి తమ పార్టీ సీట్లు కేటాయించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రజలకు సేవ చేయాలనుకున్న లక్ష్యంతో ఎవరైతే ముందుకొస్తారో వారికే 175 సీట్లలో పోటీకి అవకాశం కల్పిస్తామన్నారు. పేదరిక నిర్మూనలతో ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీల సంక్షేమానికి కృషిచేసేందుకు ప్రత్యేక అజెండాతో ప్రజా ప్రస్థానం పార్టీ ద్వారా ముందుకు వచ్చామన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 7 శాతం ఓట్లు సాధించి ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల కమీషన్ గుర్తింపు పొందడం ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమం బాగానే ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యమని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలకు చేరువవుతామని ముకుంద్ తెలిపారు. సమావేశంలో రాజమహేంద్రవరానికి చెందిన పడాల వాసు తదితరులు పాల్గొన్నారు.