– వికలాంగులకు ఏ విధమైన గ్యారంటీ లేకుండా రూ 10 లక్షలు రుణం మంజూరు చేయాలి
– విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలి
విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ:
ఆగస్టు 2న వికలాంగుల ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
– వికలాంగులకు రాజ్యాధికారం కోసం పోరాటం చేద్దాం
– వికలాంగులకు ఏ విధమైన గ్యారంటీ లేకుండా రూ 10 లక్షలు రుణం మంజూరు చేయాలి
– విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలి
– అఖిలభారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరావు పిలుపు
రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:
విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరావు శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనకబడి, నిరాధరణకు గురి అవుతున్న వికలాంగులు రాజ్యాధికారం కోసం పోరాటం చెయ్యాలని పిలుపు ఇచ్చారు.
దివ్యాంగులకు గ్రామ స్థాయి నుండి పార్లమెంట్ స్థాయి వరకు రాజకీయ రిజర్వేషన్, కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని పిలుపు నిచ్చారు. వికలాంగులకు ఎలాంటి బ్యాంక్ గ్యారంటి లేకుండా రూ 10 లక్షల రూపాయాలు స్వయం ఉపాధి కొరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అఖిల భారత దివ్యాంగుల వేదిక ప్రధాన కార్యదర్శి పోసి కుమార్ అధ్యక్షత ఆగష్టు 2 జరిగే వికలాంగుల ఛలో ఢీల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఎస్సీ, ఎస్టీ లకు, బి.సి.లకు, మైనారిటీ లకు ఏవిధంగా కమీషన్ ఉందో వికలాంగులకు కూడా జాతీయ స్థాయిలో కమీష ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తొలగించిన పెంక్షన్లు వెంట నే మంజూరు చేయాలని, రాష్ట్రం లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ ఉద్యోగాల ను భర్తీ చేమ్మలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పలివెల రాజు,రెడ్డి అనంద్, దాసరి అబ్బులు,రాపాక సత్యనారాయణ,చిన్న, కాండెల్లి రజిని, శ్యామల, యోగి తదితర్లు పాల్గొన్నారు.