విశ్వంవాయిస్ న్యూస్, రాజమండ్రి:
బొందిలి కులస్తుల ఆత్మీయ సమావేశం
బొందిలి కులస్తులకు గుర్తింపు తెచ్చిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు
త్వరలో శ్రీశైలంలో అన్నదాన సత్రం నిర్మాణం
బొందిలి సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్, బొందిలి యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆనంరోటరీ హాలులో బొందిలి కులస్తుల ఆత్మీయ సమావేశం భారీ స్థాయిలో జరిగింది. సీనియర్ నాయకులు క్షత్రియ అనంతరామ్ సింగ్,బాలాజీ శంకర్ సింగ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు.కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైకాపా యువజన విభాగం రీజనల్ ఇన్చార్జి జక్కంపూడి గణేష్ హాజరయ్యారు.బొందిలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.సుజన్ సింగ్,యువజన అధ్యక్షుడు బాలాజీ శంకర్ సింగ్, ప్రధాన కార్యదర్శి సాయి భాస్కర్ ప్రసాద్ తివారి,బి.అంజన్ సింగ్,బి.బాలాజీ సింగ్,సుగుణా సింగ్,బి.దుర్గా సింగ్ తదితరులు,బొందిలి బాంధవులు పాల్గొన్నారు.
బొందిలి కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ సామాజిక వర్గానికి గుర్తింపు తెచ్చి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మేలు చేశారని సంక్షేమ సంఘ సభ్యులు కొనియాడారు.2008 లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బొంది కులస్తులను బీసీల్లో చేర్చి ఉపకారం చేశారని,ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమను ఓబీసీ లో చేర్చాలని కేంద్రానికి సిఫార్సు చేశారని సంతోషం వ్యక్తం చేశారు.తమ కులస్తులకు శ్రీశైలంలో అన్నదాన సత్రం నిర్మించుకోడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ కు సిఫార్సు చేసిన సీఎం జగన్ కు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఈ సత్రం నిర్మాణానికి కార్యాచరణ చేపట్టాలని వారు కోరారు.