విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ ద్రాక్షారామ అదివారపు పేట గురుకుల పాఠశాలలో 52 మంది పిల్లల ఫుడ్ పాయిజన్ కి కారణమైన ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని బీఎస్పీ,పీ డీ ఎస్ యూ,స్టూడెంట్ జేఏసీ ప్రజా సంఘాలు బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బి ఎస్ పీ ఎమ్ ఎల్ ఏ అభ్యర్థి సుబ్బు భాయ్,పీ డీ ఎస్ యూ నాయకులు బి.సిద్ధూ,ఏపీ స్టూడెంట్ జేఏసీ అధ్యక్షుడు ప్రత్తిపాటి బుల్లి రాజు తదితరులు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ పక్కన ఆదివారపు పేట లో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం 52 మంది పిల్లలు కు ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగిందని.దీనికి కారణం ఆ రోజు తిన్న చికెన్ బిర్యానీ కారణమని పిల్లలు చెబుతూ ఉన్నారు. అయితే నాణ్యతలేని చికెన్ సప్లై చేయటం వల్ల నాణ్యతలేని గుడ్డు వల్ల ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని,దీనికి కారణమైన వారిని శిక్షించాలని ఆ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వారి కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని,ఈపుడ్ పాయిజనింగ్ కి కారణమైన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.వి. నాగేశ్వరరావును తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.ప్రిన్సిపాల్ ఎన్. వి.నాగేశ్వరరావు హాస్టల్ విద్యార్థులు పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని గురుకుల పాఠశాలలో అనేక సమస్యలు దిష్ట వేసాయని.నాడు నేడు ద్వారా 60 లక్షలు రూపాయలు వాటర్ ట్యాంక్ కోసం నిధులు కేటాయించారు కానీ విద్యార్థులు తాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని.హాస్టల్ లో మరుగుదొడ్లు,ఈగలు అపరిశుభ్రంగా ఉన్నాయని అన్నారు.దళిత,ఆదివాసీ, బీసీ పేద విద్యార్థులకు కోటా బియ్యం ద్వారా తిండి పెడుతున్నారని. 2018 సంవత్సరం లో వైస్సార్ జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వస్తే హాస్టల్స్ విద్యార్థులకు సన్న బియ్యం అందిస్తాను అని హామీ ఇచ్చారని.రేషన్ బియ్యం తినడం ద్వారా విద్యార్థులు అనారోగ్యలకు గురయ్యారని అన్నారు. అదివారపు పేట లో ఉన్న గురుకుల పాఠశాలను ప్రజా సంఘాలు బృందం సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఎస్పీ రామచంద్రపురం సిటీ అధ్యక్షులు షేక్ అలీ హుస్సేన్,వి.మురళీ,ఆర్. సాయి ప్రజాసంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.