విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ కరకట్టని ఆయన నివాసంలో చంద్రబాబును కలిసిన హారిక నర్శిపల్లి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పలు విషయాలను వివరించారు.జూన్ 4న రానున్న ఎన్నికల ఫలితాలలో టిడిపి జనసేన బిజెపి కూటమి ఘన విజయం సాధించి..మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.సుమారు అరగంటకు పైగా చంద్రబాబు తనకు సమయం కేటాయించి మాట్లాడటం పట్ల హారిక సంతోషం వ్యక్తం చేశారు.జిల్లాకు సంబంధించి పలు విషయాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నా రన్నారు.తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల గెలుపునకు తమ వంతు కృషి చేసామన్నారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎంపీగా విజయం సాధించడం ఖాయమని చంద్రబాబుకు తెలుపామన్నారు.