Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కెన్సర్ నివారణ చర్యలు శిక్షణ కార్యక్రమం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

కెన్సర్ నివారణ చర్యలు శిక్షణ కార్యక్రమం

రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-

రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ నందు రామచంద్రపురం డివిజన్, మరియు కొత్తపేట డివిజన్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,మరియు పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులకు,ఎం ఎల్ హెచ్ పి సిహెచ్ఓ, ఏఎన్ఎం లకు క్యాన్సర్ వ్యాధిని గుర్తించుట,చికిత్స, నివారణ చర్యల గురించి జరుగుతున్న శిక్షణ కార్యక్రమమును జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డిఎమ్ అండ్ ఎచ్ ఓ డాక్టర్ ఎం దుర్గారావు దొర పరిశీలించినారు.క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైన్ ప్రోగ్రాం పోయిన నెల 13 తేదీ నుండి మొదలైనదని వచ్చే నెల 13 ముగుస్తుందని తెలియజేసారు.మొత్తం 8 బ్యాచ్ లు,ప్రతి బ్యాచ్ 3 రోజులు శిక్షణ పొందారని,మొత్తం 240 మందిఈ శిక్షణా కేంద్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పై శిక్షణ పొందారని,అమలాపురం శిక్షణ కేంద్రంలో 376 మంది శిక్షణ పొందారని తెలిపారు.ప్రస్తుతం ఇండియాలో సంవత్సరమునకు 14 లక్షల క్యాన్సర్ కేసులు వస్తున్నాయని వాటిలో 7 లక్షల మంది మరణిస్తున్నారని,ప్రస్తుతం ఎక్కువమంది ప్రజలు బ్రెస్ట్ క్యాన్సర్,ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని తెలిపారు.అందువలన క్యాన్సర్ వ్యాధిని కు పట్టణంలో స్థాయిలో గ్రామస్థాయిలో ట్రైనింగ్ పొందిన సిబ్బంది ప్రజలకు ఈ వ్యాధికి సంబంధ లక్షణాలు ఉన్నాయేమో గుర్తించి త్వరితగతిని ట్రీట్మెంట్ చికిత్స అందించడం ద్వారా ఈ వ్యాధి యొక్క మరణరేటు తగ్గిస్తారని తెలిపారు. ప్రస్తుత సీజనల్ వ్యాధులైన డయేరియా డెంగు,మలేరియా వంటి వ్యాధులపై ప్రజలలో అవగాహన పెంపొందించాలని సూచించారు.ఈ రోజులలో క్యాన్సర్ కు అధునాతన ట్రీట్మెంట్ విధానాలైన,కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ,హార్మోన్ థెరపీ వంటి చికిత్స విధానాలు ఉన్నాయని భయపడం అవసరం లేదని,క్యాన్సర్ వ్యాధిని త్వరగా గుర్తిస్తే చికిత్స ద్వారా నివారించవచ్చు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ ప్రశాంతి సబ్ డివిజనల్ ఆఫీసర్,జి కమల్ శేషు డివిజనల్ సూపర్వైజర్ డాక్టర్ ఎం దుర్గాదేవి, డాక్టర్ హరీష్,డాక్టర్ హేమ సుధీర్ డాక్టర్ రాకేష్ కృష్ణ చౌదరి ,ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మేఘన రామకృష్ణ పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement