విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
తంగేళ్ల ఉదయ్ ని కలిసిన యువకులు
విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం.కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్వగృహంలో రామచంద్రపురం మండలం మలపాడు గ్రామ యూత్ యువజన నాయకులు నామాడి స్వామి నరేష్ కుమార్,ఆదివారపుపేట గ్రామానికి చెందిన కొండా ఉమా మహేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్బంగా ఇరువురు మాట్లాటాడుతూ రానున్న రోజులలో పార్టీ బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తాం అని అన్నారు. అనంతరం ఎంపి అభినందించారు.