విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
ఏరియా ఆసుపత్రిని సందర్శించిన మంత్రి సుభాష్
విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం పట్టణంలోని ఏరియా హాస్పిటల్ ను ఆకస్మికంగా సందర్శించారు.ఈసందర్బంగా రోగులతో మాట్లాడి వారికి ప్రభుత్వ వైద్యం సక్రమంగా అందుతుందో లేదో అని ఆరా తీశారు. ప్రభుత్వం అందించే సౌకర్యాలను కూడా మరింత మెరుగుపరిచేలా చూడాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెంట్ డాక్టర్ ప్రవీణ్,జనసేన పార్టీ ఇంచార్జ్ పోలీస్ చంద్రశేఖర్,కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.