విశ్వంవాయిస్ న్యూస్, శంఖవరం:
పేదలకు ముప్పూటలా అన్నా క్యాంటీన్ అన్నం
శంఖవరం, విశ్వం వాయిస్ న్యూస్ ;
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేదలు అందరకూ నామ మాత్రపు ధరలకే అన్న క్యాంటీన్లలో రోజూ ముప్పూటలా
సుష్టుగా అన్నం దొరుకుతుందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనావాసు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తొలి దఫాలో 100 అన్న క్యాంటీన్ల ప్రారంభం అయ్యిన నేపధ్యంలోనే పిఠాపురం నియోజవర్గం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో అన్న క్యాంటీన్‌ను వడ్డన సాలకు రిబ్బన్ కత్తిరించి శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఎన్.డి.ఎ. కూటమి నేతలైన పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యస్.వి.యస్.ఎన్. వర్మ, పిఠాపురం నియోజవర్గం బిజెపి ఇంచార్జ్ బుర్ర కృష్ణంరాజు సమక్షంలో జరిగిన ఈ ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీనివాస్ తన స్పందనను ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్లు పునర్ ప్రారంభించిన కారణంగా బడుగు, బలహీన వర్గాల, పేదవారు మూడు పూటలా ఆకలిని తీర్చుకో గలుగు తారని, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి విడతగా 100 అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం రాష్ట్ర ప్రజలు అందరికీ మేలు కరమైన, సంతోషదాయకం అయిన విషయమని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేద ప్రజల ప్రభుత్వం ఏర్పడిందని గర్వంగా చెప్పడానికి కారణం అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభమే ఒక నిదర్శనమని జ్యోతుల శ్రీనివాసు ఆ ప్రకటనలో తెలియ జేశారు.