విశ్వంవాయిస్ న్యూస్, పి గన్నవరం:
ఘనంగా మైపాల తాతాజీ జన్మదిన వేడుకలు
తాతాజీ అందరివాడు – ఎమ్మెల్యే గిడ్డి
అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )
అంబాజీపేట మండలంలో మాచవరం గ్రామానికి చెందిన ప్రముఖ స్థిరాస్తి వ్యాపారకుడు , నిస్వార్థ ప్రజా సేవకుడు మైపాల తాతాజీ జన్మదిన వేడుకలు శుక్రవారం తాతాజీ అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలో పలుచోట్ల మైపాల తాతాజీ ఫ్లెక్సీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి పి. గన్నవరం ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైపాల తాతాజీ అందరివాడు అని అన్నారు. పి గన్నవరం కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తులలో ఒకరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ పరిధిలో ముఖ్య నాయకులతోపాటు పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన , తెలుగుదేశం , బిజెపి నాయకులు పాల్గొన్నారు .