Sunday, August 3, 2025
🔔 9
Latest Notifications
Sunday, August 3, 2025
🔔 9
Latest Notifications

అంగరంగ వైభవంగా జగ్గంపేట సొసైటీ చైర్మన్ బుర్రి సత్యనారాయణ ప్రమాణ స్వీకార మహోత్సవం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతులనెహ్రూ దంపతులు, డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు, జిల్లా టిడిపి అధ్యక్షు లు జ్యోతుల నవీన్

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

జగ్గంపేట సొసైటీ చైర్మన్ గా జగ్గంపేట మండలం నరేంద్ర పట్నం గ్రామానికి చెందిన బుర్రి సత్యనారాయణ(సత్తిబాబు) త్రిసభ్య కమిటీ సభ్యులు నంద చిరంజీవి, జనసేన పార్టీ నుంచి పాలి శెట్టి సతీష్ లతో కలిసి ఆదివారం ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికిముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతులనెహ్రూ, మాజీ సొసైటీ చైర్మన్ జ్యోతుల మణి దంపతులు, డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు, జిల్లా టిడిపి అధ్యక్షు లు జ్యోతుల నవీన్ హాజరయ్యారు. ముందుగా జ్యోతుల నవీన్ తో కలిసి వందలాది మోటార్ సైకిల్ తో నరేంద్ర పట్నం నుంచి జగ్గంపేట రావులమ్మ తల్లి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తో కలిసి రావులమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుండి భారీ ర్యాలీగా జగ్గంపేట కో-ఆపరేటివ్ సొసైటీ వద్దకు చేరుకుని బాధ్యత స్వీకరించారు. అనంతరం సీఈఓ పాఠం శెట్టి అప్పలరాజు, సొసైటీ సిబ్బంది ఘనంగా సత్కరించారు. అనంతరం గోకవరం రోడ్ లోని కాపు కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలోని కూటమి నాయకులందరూ చైర్మన్ బుర్రి సత్తిబాబును త్రిసభ్య కమిటీ సభ్యులను పూలమాలతో, శాలువాల తో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జ్యోతుల మణి మాట్లాడుతూ సత్తిబాబు ఆధ్వర్యంలో జగ్గంపేట సొసైటీ మరింత అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. జ్యోతుల నవీన్ మాట్లాడుతూ నాకు అత్యంత ఆప్తుడు, నాకు రాజకీయ సలహాలు అందించే బుర్రి సత్తిబాబు సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో జగ్గంపేట మండలంలోని రైతులకు సకాలంలో రుణాల అందించి ఆదుకోవాలని అన్నారు. డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో బుర్రి సత్తిబాబు ఆధ్వర్యంలో జగ్గంపేట సొసైటీ కి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. బుర్రి సత్తిబాబు మాట్లాడుతూ నాకు రాజకీయ వనమాలు నేర్పించిన గురువు జ్యోతుల నెహ్రూ సమక్షంలో సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉందని సొసైటీని అన్ని విధాల అభివృద్ధి పరుస్తూ రైతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ సొసైటీని ప్రక్షాళన త్రిసభ్య కమిటీ సహకారంతో ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట సొసైటీ జగ్గంపేటమండలంలో మామిడాడ , మల్లి సాల కాట్రావులపల్లి సొసైటీలను ఒకే సొసైటీగా చేయడం జరిగిందని అన్నారు. నూతన చైర్మన్ రైతులకు ఉన్న బకాయిల స్థానంలో కొత్త బకాయిలను ఇప్పించాలని ఇప్పుడు పెట్టుబడి కాలం కాబట్టి రైతులు దిగుబడి పొందిన తర్వాత బకాయలు చెల్లిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్, మారిశెట్టిh భద్రం, పోతుల మోహనరావు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, తోట రవి, తోట గాంధీ, పుష్కర చైర్మన్ అడబాల భాస్కరరావు, పాండ్రంగి రాంబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుదిరెడ్ల శ్రీనివాస్, తూము కుమార్, సొసైటీ చైర్మన్లు, క్లస్టర్ ఇంచార్జిలు, సర్పంచులు, ఎంపీటీసీలు, తెలుగుదేశం, జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo