Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications

అంగరంగ వైభవంగా వీరవరం సొసైటీ నూతన అధ్యక్షుడు తోట గాంధీ ప్రమాణ స్వీకార మహోత్సవం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ అధ్యక్షుడిగా తోట గాంధీ,సభ్యులుగా నామసాని త్రాసు,మడుగుల సూర్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ,డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్, కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ బస్సా వీరబాబు,భూపాలపట్నం ప్రసాద్ తదితరులు వీరవరం చేరుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు ఘన స్వాగతం పలికి హై స్కూల్ దగ్గర నుండి సొసైటీ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తీన్మార్ డాన్సులతో భారీ బాణాసంచా కాల్పులతో సొసైటీ కార్యాలయంలో చైర్మన్ గాంధీ తో పాటు త్రిసభ్య కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.అనంతరం ఎంపీపీ తోట రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిధులు మాట్లాడుతూ పరపతి సంఘ కార్యకలాపాలను పారదర్శకంగా,రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన పాలకవర్గం పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా నూతన సొసైటీ అధ్యక్షుడు తోట గాంధీ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా గాంధీని పలువురు నాయకులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అడపా భరత్ బాబు,ఎస్వీఎస్ అప్పలరాజు,మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు కూటమి నాయకులు వీరంరెడ్డి కాశీబాబు,గుడాల రాంబాబు,తూము కుమార్,పట్టు చంటిబాబు,గరగ గోవింద్,అల్లు శివరామకృష్ణ, తోట విష్ణు మూర్తి,కంటా శ్రీను,ఎరికిరెడ్డి బాబ్జి,గోడే బాల,ఉలిసి అయిరాజ్,గంధం ప్రభాకర్, గోకేడ రాజా,అరిణే రాజేష్,స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo