కాకినాడ జిల్లా ఎస్పీ అభినందనలు
జగ్గంపేట పోలీసులు మెగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఈనెల 5వ తేదీ శనివారం జరిగిన లోక్ అదాలత్ ద్వారా జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 116 కేసులు, అలాగే గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 116 కేసులు పరిష్కారమయ్యాయి.ఈ కార్యక్రమంలో కక్షిదారులు, ఫిర్యాదుదారులు, ఇరు వర్గాల మధ్య సఖ్యతను కలిగిస్తూ, వారితో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవతో కాకినాడ జిల్లాలో జగ్గంపేట, గండేపల్లి స్టేషన్లు అత్యధిక కేసులు పరిష్కరించిన స్టేషన్లుగా నిలిచాయి.ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్‌ను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ శుక్రవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ప్రత్యేకంగా అభినందించారు. ఆయన ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని తీసుకోవడం జరిగింది ..