ఈ వారం అన్న క్యాంటీన్ దాత జగ్గంపేటకు చెందిన కీర్తి శేషులు నేదురి శ్రీనివాస్ శాంతి దంపతులు జ్ఞాపకార్థం
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు జగ్గంపేట కు చెందిన కీర్తిశేషులు నేదూరి శ్రీనివాస్ శాంతి దంపతులు జ్ఞాపకార్థం వారి కుమారులు వీరబాబు, సతీష్ ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ సభ్యులు మారిశెట్టి భద్రం మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేయడంతో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికి అక్కడ టిడిపి నాయకులు కార్యకర్తల సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా జగ్గంపేటలో కూడా గత నాలుగు సంవత్సరాలుగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఈరోజు మా సోదరులు, టిడిపి నాయకులు స్వర్గీయ నేదూరి శ్రీనివాస్ శాంతి దంపతుల కుమారులు వీరబాబు, సతీష్ అన్నా క్యాంటీన్లో అన్నదానం ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్ వి ఎస్ అప్పలరాజు, మండల టిడిపి అధ్యక్షులు జీను మణిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, టౌన్ టిడిపి అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు, మాధవరపు సూరిబాబు, వేములకొండ జోగారావు, డేగల సత్తిబాబు, సాంబతుల చంద్రశేఖర్, రెడ్డి సుబ్బారావు, పలివెల యేసు రాజు, పుర్రె వీరబాబు తదితరులు పాల్గొన్నారు.